Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y600 Turbo Launch: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో Y600 టర్బో (Vivo Y600 Turbo)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. Y సిరీస్‌లో వచ్చిన ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లతో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
డిస్ప్లే విషయానికి వస్తే.. 6.83 అంగుళాల పెద్ద AMOLED స్క్రీన్‌ను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్ (1260×2800 పిక్సెల్స్)తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు SGS లో బ్లూ లైట్, TÜV Rheinland ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కెమెరా విభాగంలో ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 MP ప్రైమరీ సెన్సార్ (f/1.8), 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
బ్యాటరీ విషయానికి వస్తే.. ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC, GPS వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో సెక్యూరిటీని అందించారు.
కొత్త మొబైల్ ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ 8GB + 256GB ధర రూ.32,000గా నిర్ణయించారు. 12GB + 256GB మోడల్ రూ.36,000, అలాగే టాప్ వేరియంట్ 12GB + 512GB ధర రూ.40,000గా ఉంది. ఇది డ్యూన్ గోల్డ్, ఎలక్ట్రిక్ బ్లూ, మిల్లేనియం పింక్ రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మే 27 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!