E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర…
School Teacher: అమెరికాలో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థిపై ఓ మహిళా ఉపాధ్యాయురాలు లైంగిక వేధింపులకు పాల్పడింది. మోంట్గోమెరి కౌంటీ పోలీసుల ప్రకారం.. 2015లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల మెలిస్సా మేరి కర్టిస్ అనే ఉపాధ్యాయురాలు లైంగిక చర్యలు జరిపింది. ప్రస్తుతం ఈమె వయసు 31 ఏళ్లు. ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్‌కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది.…
Killing Patients With Insulin: సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లను డయాబెటిస్ వ్యాధి ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తాం. కానీ అమెరికాకు చెందిన ఓ నర్సు మాత్రం మనుషుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించింది. మోతాదుకు మించి ఇన్సులిన్ ఇవ్వడం మూలంగా 17 మంది పేషెంట్ల మరణాలకు కారణమైంది. పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ప్రెస్డీ(41) ఇన్సులిన్‌తో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకుంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.
Wagner Group: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. యూరప్, అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలన్నీ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుందడగా.. అరబ్ సమాజం పాలస్తీనా వెంబడి నిలబడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దారుణ మారణహోమానికి పాల్పడ్డారు. 1400 మందిని హతమార్చారు. దీని తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. దీంట్లో 9 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.
Pig Heart Transplant: మానవులకు అవయవాలు పాడైతే, వేరే వాళ్లు దానం చేయడమో లేకపోతే మరణించడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు అమర్చుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి పంది కిడ్నీని, మరొక వ్యక్తి పంది గుండెను అమర్చారు. అయితే ప్రారంభ రోజుల్లో సదరు రోగులు బాగానే ఉన్నా తర్వాత మానవ శరీర వ్యవస్థ వాటిని…
Survival Story: మహా సముద్రంతో తప్పిపోవడం అంటే చావుకు దగ్గర కావడమే, ఇలా ఎంతో మంది మరణించారు. అయితే కొందరు మాత్రం ప్రాణంపై ఆశ వదలకుండా కొన్ని నెలల పాటు సముద్రంలో లేకపోతే దిక్కులేని ద్వీపాల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. మనుగడ కోసం వారి పోరాటమే వారిని కాపాడింది. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.
Donald Trump: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదులతో సమావేశమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం లాస్ వేగాస్ లో రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు తిగిరి ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్‌ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులను మన దేశం నుంచి బయటకు రానీయకుండా చూస్తానని అన్నారు.