Maa Inti Bangaram: నా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. సామ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి, ఆమె భర్త రాజ్ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు (Introduction) ఇక్కడ చూద్దాం.
‘మా కోసం ఇక్కడికి తరలివచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. దర్శకురాలు నందినీ రెడ్డి, రాజ్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు. వారితో పని చేయడం అద్భుతమైన అనుభూతి. ఇప్పటివరకు వారితో నాకు ఎలాంటి చిన్న వాదన గానీ, చేదు అనుభవం గానీ ఎదురవ్వలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ కలగలిసిన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దయచేసి అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. సమంత అభిమానులంతా ఖచ్చితంగా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని సామ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమంత రోజురోజుకూ ఒక నటిగా ఎదుగుతూనే ఉంది. ఆమె గత సినిమాలకు, ఈ నాటి నటనకు మధ్య చాలా వ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సమంత ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఎమోషన్.. ఇలా ప్రతి సీన్లోనూ ఆమె అద్భుతంగా నటించింది. డైరెక్టర్‌గా కాకుండా, నేను కూడా ఒక ఫ్యాన్‌లా కళ్లప్పగించి ఆమె నటనను చూశాను. ఈ సినిమా అందరినీ అలరించే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది” అని చెప్పారు. సమంత భర్త రాజ్ మాట్లాడుతూ..‘ ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినడానికి ఎంతో సాఫ్ట్‌గా, అనురాగం, ప్రేమతో కూడినదిగా అనిపిస్తుంది. కానీ, ఈ హోమ్లీ టైటిల్ వెనుక ఒక చీకటి కోణం, విపరీతమైన పగ దాగి ఉన్నాయి. సమంతకు, నందినికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, బాండింగ్ అందరికీ తెలిసిందే. అందుకే ఈ కథకు నందినీ రెడ్డి అయితేనే పర్ఫెక్ట్ న్యాయం చేయగలదని మేము ఆమెను దర్శకురాలిగా ఎంపిక చేశాం’ అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?