USA: అమెరికాలో ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అతని బాయ్‌ఫ్రెండ్ కంటిని నీడిల్స్‌తో పొడిచింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళ అతని కంటిలో రేబిస్ సూదితో పొడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
మియామి-డేడ్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ అఫిడవిట్ ప్రకారం.. 44 ఏల్ల సాండ్రా జిమెనెస్ తన ప్రియుడితో ఉంటున్న ఇంట్లోనే దారుణానికి ఒడిగట్టింది. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని ఫాక్స్ న్యూస్ నివేదించింది. బాధితుడు పోలీసులకు ఫొన్ చేసి తనను కాపాడాలని అర్థించాడు. జిమినెస్ తన కుడి కంటిపై దాడి చేసిందని, తమ కుక్కలకు ఇచ్చే రాబిస్ టీకాకు సంబంధించిన నీడిల్‌తో పొడిచిందని చెప్పాడు. అయితే ఇతర మహిళల్ని చూస్తున్నాడనే తాను ఈ పని చేసినట్లు బాధితుడు చెప్పాడు.
Read Also: Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..
సాండ్రా బాయ్ ఫ్రెండ్ మంచంపై పడుకున్న సమయంలో అతనిపై దూకింది, అతను తేరుకునే లోపే సూదితో కంటిలో పొడిచింది. దాడి తర్వాత ప్రస్తుతం బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న సాండ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి గురించి ప్రశ్నించిన నేపథ్యంలో తన బాయ్‌ఫ్రెండ్ తనకు తానే గాయాలు చేసుకున్నాడని బదులిచ్చింది.