IPL 2024: ప్రతి జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 ఏంతో కీలకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tom Moody React on USA Pitches: టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రదర్శనలకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ అంటున్నారు. ఐపీఎల్ 2024లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయన్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికాలో ఆడడం చాలా మంది ఆటగాళ్లకు కొత్త అనుభవం కానుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మర్చి 23న ఆరంభం కానుండగా.. జూన్ 1న టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టీమ్ డెసర్ట్ వైపర్స్ నిర్వహించిన ఇంటరాక్షన్‌లో టామ్ మూడీ మాట్లాడుతూ… ‘మార్చి-మే నెలల్లో ఐపీఎల్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జరగబోతున్నాయి. ఈ టోర్నీలలో సత్తాచాటడం ఆటగాళ్లకు చాలా కీలకం. పరుగులు చేయడం, వికెట్లు తీయడం, స్థిరంగా రాణించడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయి. పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలంటే.. ఈ లీగ్‌లలో సత్తా చాటడం చాలా ముఖ్యం. గతంలో కంటే ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడాలని ప్రతి ప్లేయర్ అనుకుంటాడు’ అని అన్నాడు.
Also Read
Also Read: National Book Fair: హైదరాబాద్‌లో నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన!
‘టీ20 ప్రపంచకప్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న కరేబియన్‌లో చాలా మంది క్రికెటర్లు ఆడారు. అయితే అమెరికాలో ఆడాల్సి రావడం చాలామంది క్రికెటర్లకు నూతన అనుభవమే. కానీ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు భిన్నమైన పిచ్‌లపై ఆడుతారు. వారు అమెరికాలో వాతావరణాన్ని కూడా త్వరగా అలవాటు చేసుకుంటారు’ అని టామ్ మూడీ చెప్పారు. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్న సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ జంపా వంటి కొంతమంది ఆటగాళ్లకు అమెరికా పిచ్‌లు అలవాటే. అయితే టీమిండియా ఆటగాళ్లకు మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభవం కానుంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!