Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ ఏడాది ఇది 5వ ఘటన. వరసగా జరుగుతున్న ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి సమీర్ కామత్ సోమవారం శవమై కనిపించాడు. సమీర్ కామత్ ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నారు. యూఎస్ సిటిజన్‌షిప్ ఉన్న కామత్ మరణంపై విచారణ జరుగుతోంది.
Read Also: Sharad Pawar: ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ వర్గం సూచించిన కొత్త పేర్లు, ఎన్నిక చిహ్నాలు ఇవే..
దీనికి ముందు హైదరాబాద్‌కి చెందిన స్టూడెంట్‌ని నలుగురు దుండగులు తీవ్రంగా దాడి చేసి, ఫోన్ దొంగలించారు. బాధితుడు సయ్యద్ ముజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున అతనిపై దాడి జరిగింది.
గత వారం, ఓహియోలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనే విద్యార్థి శవమై కనిపించాడు. అదే వారం పర్డ్యూ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న నీల్ ఆచార్య యూనివర్సిటీ క్యాంపస్‌లో చనిపోయాడు. అతని తల్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన గంటల తర్వాత శవమై కనిపించాడు. జనవరి 16న హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే విద్యార్థిని జార్జియాలోని లిథోనియాలో ఒక హోమ్‌లెస్ వ్యక్తి హత్య చేశాడు. జనవరిలో అకుల్ ధావన్ అనే విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెలుపల శవమై కనిపించాడు.