Chewing Gum: అమెరికాలోని ఓరెగాన్‌లోని 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందు ‘‘చూయింగ్ గమ్’’ సాయం చేసింది. 1980లో 19 ఏళ్ల బార్బరా టక్కర్ అనే యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేశాడు. ఆమె మృతదేహం క్యాంపస్ పార్కింగ్ స్థలంలో దొరికింది.
South China Sea: దక్షిణ చైనా సముద్ర విషయంలో సరిహద్దు దేశాలను చైనా తన బలాన్ని చూసుకుని కవ్విస్తోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది. దురాక్రమణవాదంతో భయపెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా…
Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్విల్లే నార్త్ హాప్కిన్స్ హైస్కూల్లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
S Jaishankar: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు అంతర్జాతీయ సంస్థలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమేస్టి ఇంటర్నేషనల్, యూఎన్ హక్కుల సంస్థలు దీనిని సీఏఏని తప్పుగా భావిస్తున్నారు. వీరికి అగ్రరాజ్యం అమెరికా జతకలిసింది. సీఏఏపై ఆందోళన చెందుతున్నామని, ఇది ఎలా అమలువుతుందో నిశితంగా గమనిస్తున్నామంటూ కామెంట్స్ చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన సీఏఏపై అమెరికా వ్యాఖ్యానించడాన్ని భారత్ తప్పుబడుతోంది.
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని,
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
TikTok: భారత్ జాడలోనే అమెరికా నడిచింది. చైనాకు షాక్ ఇస్తూ ప్రముఖ వీడియో ప్లాట్ఫారం టిక్ టాక్‌కి వ్యతిరేకం బిల్‌ని ఆమోదించింది. యూఎస్ ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. టిక్ టాక్ని తన చైనా ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి బలవంతంగా ఉపసంహరించుకోవాలనే బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇది జరగకుంటే అమెరికాలో టిక్ టాక్ని నిషేధించవచ్చు.
Sophia Leone: అడల్ట్ ఫిల్మ్‌స్టార్స్ వరసగా మరణిస్తున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల సోఫియా లియోన్ ఈ నెల ప్రారంభంలో తన అపార్ట్మెంట్లో మరణించింది. ఈ విషయాన్ని ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో శనివారం తెలిపారు. మార్చి 1న యూఎస్‌లోని ఆమె అపార్ట్మెంట్లో సోఫియా అచేతన స్థితిలో ఉండగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు.