Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.
టెక్నాలజీ పెరిగేకొద్దీ కొత్త కొత్త మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఈజీ మనీ కోసం కొంత మంది అడ్డదారులు కూడా తొక్కుతున్నారు. చట్టాలు వదిలిపెట్టవన్న సంగతి తెలిసి కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.
హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మగాళ్లలో భయం మొదలైంది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.
రీల్ జీవితానికి.. రియల్ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలో కూడా చేస్తే జీవితాలు బుగ్గిపాలవుతాయి. సినిమా అనేది వినోదం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని మెప్పించేందుకు ఏవేవో చూపిస్తారు. అందులో వాటిని పాలైతే మాత్రం కటకటాల పాల్వడం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? యూపీలో అచ్చం సినిమా తరహాలోనే ఒక హత్య జరిగింది.
తమిళనాడులో ఇటీవల పోలీసుల దెబ్బలు తాళలేక సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి.. పోలీసులను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పింది.
దేశంలో రోజురోజుకూ నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ప్రేమికుడితో సుఖం కోసం ఇల్లాల్లు రక్తసంబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటి దాకా కట్టుకున్నవాళ్లను కడతేర్చిన అర్ధాంగులు.. ఇప్పుడు కన్నపేగు పంచుకుని పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. లులు మాల్ మేనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. అనంతరం హోటల్కి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.