UP: లక్నో అమిటీ వర్సిటీలో దారుణం.. సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు
- లక్నో అమిటీ వర్సిటీలో దారుణం
- సహచర విద్యార్థిని 60 చెంపదెబ్బలు కొట్టిన స్నేహితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాల అన్నాక.. కాలేజీ అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఈ మధ్య అవి మరింత శృతిమించుతున్నాయి. ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ ఒక విద్యార్థిని సహచర విద్యార్థులు చెంపదెబ్బలతో వాయించేశారు. కొట్టొద్దంటూ వేడుకున్నా వదిలిపెట్టకుండా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో అమిటీ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: UP: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా.. 3 రెట్ల జీతం పెంపు
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయంలో శిఖర్ ముఖేష్ కేసర్వానీ అనే విద్యార్థి రెండో సంవత్సరం లా చదువుతున్నాడు. అయితే శిఖర్‌ను అతని సహవిద్యార్థులు వర్సిటీ పార్కింగ్ స్థలంలో వాహనంలోకి ఎక్కించుకు ‘‘50-60’’ సార్లు చెంపదెబ్బలు కొట్టారు. వారి మధ్య గొడవకు గల కారణాలేంటో తెలియదు గానీ.. ఇష్టానురీతిగా దాడి చేశారు. ఆగస్టు 26న జరిగిన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తన కొడుకును దారుణంగా కొట్టారని.. అంతేకాకుండా క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించడమే కాకుండా.. తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ బిడ్డ క్యాంపస్‌లో చదవడం లేదని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: UK: యూకే చరిత్రలో సరికొత్త అధ్యయనం.. హోం కార్యదర్శిగా ముస్లిం మహిళ నియామకం
శిఖర్ తండ్రి ముఖేష్ కేసర్వానీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు విద్యార్థులు ఆయుష్ యాదవ్, జాన్వి మిశ్రా, మిలే బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లా పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇక ఈ దాడి గురించి యూనివర్సిటీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A video of an Amity University law student in UP's Lucknow being slapped by classmates atleast 26 times in over a minute has surfaced on social media. The trigger behind this incident is yet to be ascertained. pic.twitter.com/FssBFAvEuT
— Piyush Rai (@Benarasiyaa) September 5, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!