UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
పాఠశాల అన్నాక.. కాలేజీ అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఈ మధ్య అవి మరింత శృతిమించుతున్నాయి. ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ ఒక విద్యార్థిని సహచర విద్యార్థులు చెంపదెబ్బలతో వాయించేశారు.
ఆలుమగలు అన్నాక చిన్న.. చిన్న గొడవలు.. అలకలు సహజమే. అలా పోట్లాడుకుంటారు.. అంతలోనే కలిసిపోతుంటారు. ఇదంతా సంసార జీవితంలో కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. యూపీలో ఒక మహిళ మాత్రం బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడొక చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. రోజురోజుకూ నేర తీవ్రత పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. స్నేహితుడి చెల్లిని ప్రేమించిన పాపానికి ప్రియుడిని అత్యంత క్రూరంగా చంపేసి అవయవాలు నదిలో విసిరేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
రాత్రియుగం నుంచి రాకెట్ యుగానికి వచ్చాం. కాలాలు.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అజ్ఞానంతో దారుణాలకు ఒడిగట్టేవారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. సంపద పెరిగింది. ఇలాంటి తరుణంలో క్రైమ్ రేట్ తగ్గాల్సింది పోయి.. క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం..
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తేవడంతో విసిగిపోయి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు ఓ ప్రియుడు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్‌ను అత్యంత దారుణంగా టోల్ సిబ్బంది దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కర్రలతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.