Lunar Eclipse : ప్రారంభమైన చంద్రగ్రహణం..సూతక కాలం నియమాలు ఇవే.!
- ఈ రోజు సాయంత్రం అరుదైన బ్లడ్ మూన్
- సూతక కాలం ప్రారంభం.. పాటించాల్సిన నియమాలు
- గ్రహణం తర్వాత చేయాల్సిన శుభకార్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతిలో సంభవించే అద్భుత ఖగోళ సంఘటనలలో ఒకటైన చంద్రగ్రహణం నేడు (మార్చి 3, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత్‌లో కనిపిస్తుండటంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా తోడైంది. ఈ గ్రహణం సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోయే ‘బ్లడ్ మూన్’ (Blood Moon) దృశ్యం కనువిందు చేయనుంది.
Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
గ్రహణం సమయాలు (భారత కాలమానం ప్రకారం):
- గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3:20 గంటలకు.
- గ్రహణం ముగింపు: సాయంత్రం 6:46 గంటలకు.
- మొత్తం కాలం: సుమారు 3 గంటల 27 నిమిషాలు.
- బ్లడ్ మూన్ సమయం: సాయంత్రం 4:34 నుండి 5:33 గంటల మధ్య చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
భారత్‌లో ఎప్పుడు కనిపిస్తుంది?
భారత్‌లో ఈ గ్రహణం ‘గ్రస్తోదిత’ రూపంలో కనిపిస్తుంది. అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై , హైదరాబాద్ వంటి ప్రాంతాలలో సాయంత్రం 6:26 గంటల సమయంలో చంద్రోదయం అయినప్పటి నుండి 6:46 గంటల వరకు (గ్రహణం విడిచే వరకు) దీనిని చూడవచ్చు.
సూతక కాలం , నియమాలు:
చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సూతకం ఈరోజు ఉదయం 6:20 గంటలకే ప్రారంభమైంది.
ఏం చేయకూడదు: సూతక కాలంలో ఆహారం వండటం, తినడం, పూజలు చేయడం , దైవ విగ్రహాలను తాకడం నిషిద్ధం.
ఏం చేయాలి: ఈ సమయంలో గాయత్రీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం లేదా భగవంతుని స్మరణ చేయడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత (సాయంత్రం 6:46 గంటలకు) స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని దానధర్మాలు చేయడం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీలు: గర్భిణీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉండి దైవ ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు:
సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని నాసా తెలిపింది. టెలిస్కోప్ లేకపోయినా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఈ చంద్రగ్రహణం సింహరాశి , పూర్వాఫాల్గుణి నక్షత్రంలో సంభవిస్తోంది. దీని ప్రభావం వివిధ రాశులపై ఎలా ఉంటుందో మీ వ్యక్తిగత జాతకాలను బట్టి తెలుసుకోవచ్చు.
Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!