ఉత్తరప్రదేశ్‌లో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులే షాక్ అయ్యే ఘటన తెరపైకి వచ్చింది. ఇక చేయని నేరానికి అణ్యం పుణ్యం ఎరుగని ఆరుగురు జైలు పాలయ్యారు. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూడడంతో పోలీసులు అవాక్కయ్యారు. అసలేం జరిగింది? వరకట్నం కేసులో చోటుచేసుకున్న బిగ్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ రుచిచూసింది
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లా. 2023లో 20 ఏళ్ల యువతి అత్తింటి నుంచి అదృశ్యమైంది. దీంతో బాధితురాలి కుటుంబం అదే ఏడాది అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలే తమ బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించినా ఎక్కడా జాడ దొరకలేదు. దీంతో పోలీసులు వరకట్నం కోసం వివాహితను చంపేశారని భర్త, అత్తమామలు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె భర్త, ఆరుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304B కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
రెండేళ్ల నుంచి ఈ కేసు కొనసాగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, నిఘా బృందాలు గాలిస్తుండగా మధ్యప్రదేశ్‌లో చనిపోయిన బాధితురాలి జాడ కనిపించింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని ఔరయ్య సర్కిల్ ఆఫీసర్ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఏం చేస్తుందో.. ఇంత కాలం కుటుంబంతో, అత్తమామలతో ఎందుకు సంబంధాలు ఏర్పరచుకోలేదో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఔరయ్యకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకే నిందితులపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు వివరణ ఇచ్చారు.