బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా రామమందిర మొదటి అంతస్థులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య అశాన్య.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని కాన్పూర్‌లో కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలిని మోడీ ఓదార్చారు. మీ బాధలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు మోడీ అన్నారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…
UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో శుక్రవారం పెద్ద ఎత్తున యాక్షన్ చేపట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మాంసం, మద్యం మరియు అభ్యంతరకమైన ప్రకటనలు నిషేధిస్తూ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రామమందిరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ నిషేధం అమలు కానుంది.
పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్‌లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం.
Blue Drum: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్తని చంపేసి, డెడ్ బాడీని 15 ముక్కలుగా కట్ చేసి, ఒక బ్లూ కలర్ డ్రమ్‌లో పెట్టి, దానిని సిమెంట్‌తో కప్పేశారు. చివరకు సౌరభ్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఈ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఒక మహిళ తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయింది. ఈ సంఘటన యావత్ దేశంలో వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటి మరో సంఘటన యూపీలోని బాదౌన్‌లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తె మామగారితో పారిపోయింది. మమత అనే మహిళ, తన కూతురి మమా శైలేంద్ర అలియాస్ బిల్లుతో లేచిపోవడం సంచలనంగా మారింది.
వామ్మో.. మీరట్‌లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్నటికి మొన్న భర్తను ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా చంపేసి.. అనంతరం ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. ఈ దారుణాన్ని ఇంకా మరువక ముందే మరో ఘోరం మీరట్‌లో వెలుగుచూసింది.