ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోతోందా ? రాలడాన్ని ఆపే అద్భుత మార్గాలు ఇవే..
గురువారం ఉదయం ఫరూఖాబాద్‌లోని మొహమ్మదాబాద్ ఎయిర్‌స్ట్రిప్ దగ్గర ఒక ప్రైవేట్ విమానం రన్‌వేపై నుంచి జారిపడి సరిహద్దు గోడకు కొద్ది దూరంలో ఆగిపోయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానంలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Jaish-e-Mohammad New Strategy: జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్!
జెట్‌సర్వ్ ఏవియేషన్‌కు చెందిన విమానం ఉదయం 11:15 గంటలకు టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై నుంచి దాదాపు 400 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా దిశ తప్పింది. అలైన్‌మెంట్ కోల్పోయి గోడ దగ్గర ఆగిపోయింది. అధికారుల నివేదిక ప్రకారం.. విమానం ట్విన్-ఇంజన్ చార్టర్ భోపాల్‌కు బయలుదేరాల్సి ఉంది. సంఘటన జరిగిన సమయంలో పైలట్లు నసీబ్ బామన్, ప్రతీక్ ఫెర్నాండెజ్ ఉన్నట్లు తెలిపారు. ఖిమ్సేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో బీర్ తయారీ యూనిట్‌ను అంచనా వేసేందుకు ఒక బృందంతో వచ్చిన వుడ్‌పెకర్ గ్రీన్ అగ్రి న్యూట్రిప్యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అరోరా, ఎస్‌బీఐ నుంచి సుమిత్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ టిక్కు, యూపీ ప్రాజెక్ట్ హెడ్ మనీష్ పాండే విమానంలో ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు.
విమాన చక్రాల్లో ఒక దాంట్లో గాలి పీడనం తక్కువగా ఉండడంతో రన్‌వే నుంచి పక్కకు తప్పినట్లు సమాచారం. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముందు జాగ్రత్తగా చేరుకున్నారు.