ఉత్తరప్రదేశ్‌లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగర్ కొత్వాలి పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Jani Master: పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి.. వీడియో రిలీజ్ చేసిన జానీ మాస్టర్
వివరాల్లోకి వెళ్తే.. ఘటన జరిగిన రోజు రాత్రి తనకు బాగాలేదని డాక్టర్ వద్దకు వెళ్తున్నానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. పొరుగున ఉండే ఆ మహిళ అతడిని తన ఇంటికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లింది. ఆమె తనతో సెక్స్ చేయమని ఆ వ్యక్తిని కోరింది. దానికి ఆ వ్యక్తి నిరాకరించాడు. ఆ వ్యక్తి నిరాకరించడంతో కోపంతో మహిళ పదునైన ఆయుధం తీసుకుని అతని ప్రైవేట్ భాగాలను నరికేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి తన కష్టాలను చెప్పుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Farmers Protest: మిల్లులో పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రోడ్డుపై బైఠాయించిన రైతులు
బాధిత వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీయగా.. తీవ్ర రక్తస్రావంతో పరిగెత్తుతున్న వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గమనించారు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ.. ఆ వ్యక్తికి రక్తస్రావం ఆగడం లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.