విద్యార్థులకు మంచి చదువు, మంచి భవిష్యత్ అందించాల్సిన విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాలను నడిపిస్తున్నాయి. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారులు వారి ధన దాహానికి బలైపోతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది.
దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్‌లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది.
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
UP News: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను బందీగా చేసుకుని ఓ మదర్సా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ-రిక్షా, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు ఆరుగురికి గాయాలయ్యాయి.