ప్రేమకు వయస్సు లేదని అంటారు. ఇది ఏ వయసులోనైనా ఎవరికైనా పుట్టొచ్చు. యూపీలోని కాన్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మధ్య వయస్కురాలు మైనర్ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా తన వయసులో మూడు రెట్లు ఎక్కువ వయసున్న మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ పిల్లలు ఎదురు తిరిగారు. అయినప్పటికీ.. వారి కలయిక కొనసాగింది.
యూపీలోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో..
మొత్తం వ్యవహారం యూపీలోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుందని ప్రాంతంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న 51 ఏళ్ల మహిళ భర్త వేరే ప్రాంతంలో చేస్తాడు. ఆమెకు నలుగురు పిల్లలు. పెద్ద కుమార్తెకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఆ మహిళకు తన గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలోని 18 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా కలవడం కూడా మొదలుపెట్టారు. 18 బాలుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసుకున్న మహిళ పిల్లలు ఆమెకు తప్పుబట్టారు. బాలుడిని బెదిరించారు. అయినప్పటికీ వారిద్దరూ కలవడం మానలేదు.
కలిసి బతుకుతామని పట్టుబట్టారు..
ఇద్దరూ ఊరి బయట పొలాల్లో కలవడం మొదలుపెట్టారు. దీంతో పిల్లలు తమ తల్లిపై నిఘా పెట్టడం ప్రారంభించారు. ఒక రోజు అవకాశం రావడంతో మైనర్ ప్రేమికుడితో కలిసి ఆమె పారిపోయింది. తన తల్లి పారిపోయిందన్న వార్త తెలియగానే.. పెళ్లయిన పెద్ద కూతురు పోలీసుల సాయంతో వెతకడం ప్రారంభించింది. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ, ఆమె ప్రేమికుడి కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ప్రేమికులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు జీవించాలని పట్టుబట్టారు. ప్రస్తుతం వీరిని కుటుంబీకులకు అప్పగించారు.