అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది.
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు.
Gun Fire : అమెరికాలో మరోసారి భీకర కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దుండగుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
ప్రపంచాన్ని పర్యటించడానికి, ఉత్తమ దేశాలలో స్థిరపడటానికి ఎవరు ఇష్టపడరు. అది చాలా మంది ప్రజల కల. అయినప్పటికీ ఇది అంత సులభం కాదు. అక్కడ ఇల్లు, భూమి కొనాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా చాలా డబ్బు కావాలి.
మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. చిన్న పిల్లలకు పప్పీలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్తుంటారు. అయితే, ఆ కుక్క వల్లే మనకు పేరు వస్తే ఎలా ఉంటుంది?. ఓ బుజ్జి కుక్కపిల్ల ఏకంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
హిందువులపై దాడుల్ని ఖండిస్తూ అమెరికాలోని జార్జియా అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూఫోబియాను ఖండిస్తూ చేసిన ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ "అదృశ్య హస్తం" నడిపిస్తోందని చైనా ఆరోపించింది.