Naegleria Fowleri Infection: ప్రపంచంలో కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కోవిడ్ 19 వ్యాధి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు కోవిడ్ తో ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికే 92 దేశాల్లోకి ఈ వ్యాధి పాకింది. 35 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరప్…
ఉక్రెయిన్ రాజధానికి అడ్డుగోడగా నిలిచిన బుచా సిటీని సర్వనాశనం చేసింది రష్యా. వందలాది మందిని ఊచకోత కోసింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న పుతిన్ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. బుచా ఘటనలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. ఐక్యరాజ్యసమితిలో బుచా మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ కూడా మద్దతు తెలిపింది. బుచా…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు..…
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం…
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…
హెచ్-1బీ వీసాదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది అమెరికా ప్రభుత్వం… హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్ అనుమతులు ఇవ్వడానికి యూఎస్ సర్కార్ అంగీకరించింది.. ఇక, ఈ నిర్ణయంతో వేలాది మంది ఇండో-అమెరికన్ మహిళలకు లబ్ధి చేకూరనుంది.. ఈ వేసవిలో వలస వచ్చిన జీవిత భాగస్వాముల తరపున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ దావాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయంలో సెటిల్‌మెంట్ చేసుకుంది.. ఇది ఒక పెద్ద…
భారత ప్రధాని నరేంద్ర మోడీ-అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సమావేశంపై అధికారికంగా ప్రకటన చేసింది వైట్ హౌస్.. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వెల్లడించింది.. కాగా, ప్రధాని మోడీ.. ఈ వారమే అమెరికా వెళ్లనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ.. అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి.. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు.…
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కరోనా, తీవ్రవాదంపై ప్రధాని ప్రసంగించడంతోపాటు ఆప్ఘనిస్థాన్‌పై భారత వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం గురించి చర్చించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌తో మోడీ భేటీ అవుతారని సమాచారం. కరోనా కారణంగా విదేశీ పర్యటనలకు దూరమయ్యారు మోడీ.. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ…
యుద్ధం గెలవాలంటే.. నడిపించే నాయకుడు ఉండాలి.. దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎదురెళ్లేంత సాహసం ఉండాలి.. వెన్ను చూపని వీరులను ఎన్నుకోవాలి.. శత్రువు ఎక్కువగా ఉన్నా సరే స్ఫూర్తిని పంచే నాయకుడు అయ్యిండాలి.. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు లక్షల మంది ఉన్నా వేలమంది బాహుబలి సైన్యం ఎలా గెలిచింది? వారిలో స్ఫూర్తిని నింపి బాహుబలి ‘కాలకేయుడి’ని చంపేశాడు. కానీ అప్ఘనిస్తాన్ లో మాత్రం దీనికి రివర్స్ అయ్యింది. పోరాటం చేయాల్సిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాడి వదిలేసి వేరే దేశం…
ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియదు… ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడికి తెగబడతారో తెలియదు..దేశమంతా హైటెన్షన్….. భయం గుప్పిట్లో ఆఫ్గన్ ప్రజలు మరి కొన్ని గంటల్లో ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగాలి. ఆగస్టు 31 నాటికి ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దాని మిత్రదేశాలకు చెందిన సైనికులంతా వెళ్లిపోవాలి. ఇది అమెరికా-తాలిబాన్ల మధ్య డీల్. సో డెడ్‌లైన్ దగ్గరవుతోంది. ఇంకో 24 గంటలే ఉంది. అమెరికా తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా…