Gun Fire : అమెరికాలో మరోసారి భీకర కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దుండగుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. ఘటన అనంతరం దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు తన AR-15 తుపాకీతో పొరుగున ఉన్న యార్డ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాధితులు పిల్లవాడు పడుకుంటున్నాడు. అందుకు షూటింగ్ ఆపమని కోరారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆవేశంలో ఆ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వారు మరణించారని అధికారులు తెలిపారు.
Read Also: Building Collapse: మహారాష్ట్రలో ఘోరం,, భవనం కూలి ముగ్గురి మృతి
క్లీవ్‌ల్యాండ్ నుండి సుమారు 11:31 గంటలకు జరిగిన సంఘటనకు సంబంధించి శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ అధికారులకు కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పలువురిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అప్పటికే వారిలో కొందరు మరణించారు. శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ గ్రెగ్ కేపర్స్ ప్రకారం.. ఇంట్లో 10 మంది వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒకరు పురుషుడు, ఓ చిన్నారి ఉన్నారు. బాధితుల్లో 8 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని కేపర్స్ తెలిపారు. ఈ దాడిలో 8 ఏళ్ల చిన్నారి, ఇంట్లో ఉన్న మరో నలుగురు వ్యక్తులు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. నిందితుడు మెక్సికో వాసి అని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. గతంలో అమెరికాలోని ఉటాలో కాల్పుల ఘటనలో ఎనిమిది మంది మరణించారు. అప్పుడు కూడా ఐదుగురు చిన్నారులు దాడితో చనిపోయారు. ఇంతకు ముందు కూడా అమెరికాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
Read Also: Gold Update : ఒక్క మిస్ కాల్తో బంగారం రేట్లు తెలుసుకోండి ఇలా