ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలు తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా హింస సాగుతోంది.. వరుసగా బాంబు పేలుళ్లు కాబూల్ వాసులను వణికిస్తున్నాయి.. ఇప్పటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఐసిస్ జరిపిన దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 180 దాటిపోగా.. మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది అమెరికా.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద వచ్చే 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రాగల 24…
కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు,…
అగ్రరాజ్యం అమెరికా, తాలిబన్లు ఒక్కటైపోయారా ? దళాల ఉపసంహరణ నిర్ణయం తర్వాత… తాలిబన్లు అమెరికా సైన్యానికి సహకరిస్తున్నారా ? నాటో దళాల తరలింపునకు… తాలిబన్లు దగ్గరుండి సాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్లు… ప్రజలను అడ్డుకుంటున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలకు వెళ్లేందుకు శరణార్థులుగా వచ్చిన వారిపై కాల్పులు జరిపినా… తమకేమీ తెలియనట్లు నటించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు మీద తప్పు…
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మళ్లీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక్క రోజే లక్షకు పైగా కేసులు రావడం కలకలం రేపింది. జూన్‌లో అత్యంత తక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు మళ్లీ పీక్‌కి చేరుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఒక శుక్రవారం రోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్ నెల చివరిలో రోజువారీ కేసులు 11 వేలకు పడిపోయాయి. కానీ,…
అమెరికాలో వేడిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఎప్పుడు చల్లగా ఉండే అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. మంచు కొండలు ఎక్కువగా…
ఐసీఎమ్‌ఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిరాకరించిన సంగతి తెలిసిందే.. యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ను అమెరికాలో సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.. అత్యవసర వినియోగానికి అనుమతి కోరగా ఎఫ్‌డీఏ నిరాకరించింది. మరింత అదనపు సమాచారాన్ని కోరింది.. అయితే, కోవాగ్జిన్ కోసం మార్కెటింగ్ అనువర్తనానికి మద్దతుగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్…
హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ జరిగింది.. ఇది.. అమెరికాలో వెలుగుచూసింది.. బెంచ్ అండ్ స్విచ్ తరహా మోసానికి పాల్పడింది టెక్ కంపెనీ.. దీనిపై టెక్సస్లోని హూస్టన్ కోర్టులో నేరాన్నిఅంగీకరించారు క్లౌడ్జెన్ కంపెనీ ప్రతినిధులు.. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు సృష్టించిన ఆ సంస్థ… కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసింది… అయితే, అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికే ప్రయత్నం చేసింది… అడిగిన కంపెనీకి…