అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్‌కు చెందిన విద్యార్థి యూఎస్‌లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తూ 2019లో ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్, జెట్-సెట్టింగ్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను యూఎస్‌లోని ఓ కోర్టు బుధవారం విడుదల చేసింది.జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలలో అమెరికాకు చెందిన చాలా మంది పెద్ద వ్యక్తుల పేర్లు కనిపించాయి.
నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్‌లోని రెండు కార్లు…
అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్‌లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ODR) ప్రకారం, భారతదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగినట్లు తెలిసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 268,923 మంది విద్యార్థులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నారు.
India Mango Exports: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ మామిడి క్రేజ్ పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడిన మామిడిలో 19 శాతం పెరుగుదల కనిపించింది.
At Least 22 Killed in Mass Shooting in US: యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బుధవారం మైనే, లెవిస్టన్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారని ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారని పేర్కొంది. సమాచారం అందుకున్న యూస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అమెరికాలో తన కార్ల చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీలో చెల్లింపును అనుమతించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ సంపన్న కస్టమర్ల అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని యూరప్‌కు విస్తరిస్తుందని కంపెనీ మార్కెటింగ్, వాణిజ్య చీఫ్ ఎన్రికో గల్లీరా మీడియాతో చెప్పారు.