Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు.
Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి.
Trump Gold Card: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్ కార్డు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. 5 మిలియన్ డాలర్లు (రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నారు.
UN: ‘‘లే ఆఫ్స్’’ కేవలం ఐటీ, ఇతర పరిశ్రమలకు పరిమితం కాలేదు. తాజాగా, ఐక్యరాజ్యసమితి కూడా తన ఉద్యోగులకు తొలగించే పనిలో ఉంది. గత కొన్నేళ్ళ కాలంగా, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక సంక్షోభం, ఆదాయం తగ్గడం, ఏఐ విస్తృత స్థాయి వినియోగం కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతోనే యూఎన్ బాధపడుతోంది. Read Also: Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అవసరమైతే భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. హహల్గాం ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.