Hinduphobia: హిందువులపై దాడుల్ని ఖండిస్తూ అమెరికాలోని జార్జియా అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూఫోబియాను ఖండిస్తూ చేసిన ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది. హిందూఫోబియా, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ.. 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న హిందూ మతం ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన మతాలలో ఒకటి. అంగీకారం, పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉందని తీర్మానం పేర్కొంది.జార్జియాలోని అతిపెద్ద హిందూ, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీలలో ఒకటైన అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Read Also: RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
వైద్యం, సైన్స్, ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని తీర్మానం గమనించింది. యోగా, ఆయుర్వేదం, మెడిటేషన్, ఫుడ్, మ్యూజిక్, ఆర్ట్స్ రంగాలతోనూ సాంస్కృతికంగా ఎంతో తోడ్పాటు అందించారని, అమెరికా సమాజంలో లక్షల సంఖ్యలో జీవితాలను మార్చినట్లు తీర్మానంలో తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదు చేయబడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంటూ, హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి మద్దతు ఇచ్చే విద్యారంగంలోని కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని తీర్మానం పేర్కొంది.