Vivek Ramaswamy: అగ్రరాజ్యంలో స్థిరపడ్డ భారతీయ అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు.. బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమమన్నారు. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్న వివేక్ రామస్వామి.. అమెరికా అంటే ఏంటో…
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.
Indian Dams : జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమి వేడి ద్రవాలతో నిండిన గ్రహం. ప్రతి సెకనుకు భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు పరిణామాలపై యూఎన్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోంది.
పార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు.
ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు.
Gun Fire: తన భార్య విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా తన ఐదుగురు పిల్లలను, అత్త, భార్యను కాల్చి చంపాడు.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను విస్తరింపజేస్తామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది.
ఓ 18 ఏళ్ల కుర్రాడు కొత్త చరిత్ర సృష్టించాడు.. అమెరికాలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్రకెక్కాడు.. యూఎస్‌లోని అర్కాన్సాస్‌లోని ఒక చిన్న పట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్‌గా ఎన్నికయ్యాడు 18 ఏళ్ల జైలెన్ స్మిత్.. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించాడు.. స్థానిక మీడియా ప్రకారం, అతను తన ప్రత్యర్థి మాథ్యూస్‌పై 185 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.. జైలెన్ స్మిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నత పాఠశాల…
గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు ఓ వ్యక్తి గొప్ప సాహసమే చేశాడు. ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా?. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి 150 వెలిగించిన కొవ్వొత్తులను 30 సెకన్ల పాటు నోటిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.