మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. చిన్న పిల్లలకు పప్పీలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్తుంటారు. అయితే, ఆ కుక్క వల్లే మనకు పేరు వస్తే ఎలా ఉంటుంది?. ఓ బుజ్జి కుక్కపిల్ల ఏకంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read:Tamil Nadu: తమిళనాట బిల్లుల గొడవ.. గవర్నర్ పై డీఎంకే కీలక తీర్మానం
పెర్ల్ అనే రెండేళ్ల ఆడ చువావా ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా జీవించే కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. పెర్ల్ ఎత్తు 9.14 సెం.మీ (3.59 అంగుళాలు) ఉంటుంది. అంటే పాప్సికల్ స్టిక్ కంటే చిన్నది. రిమోట్ కంటే చిన్నగా.. డాలర్ పొడవుతో సమానం ఉంది. సెప్టెంబరు 1, 2020న యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించింది. ఈ రికార్డు గతంలో మిరాకిల్ మిల్లీ (9.65 సెం.మీ.; 3.8) పేరిట ఉండేది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, పెర్ల్ మిల్లీకి బంధువు. అయితే 2020లో పెర్ల్ పుట్టకముందే అది చనిపోయింది. 553 గ్రాముల బరువు ఉందట. గతంలో ఆ యజమాని ఇంట్లోని కుక్క పేరిట ఉన్న రికార్డును, అక్కడే ఉండే మరోటి బద్ధలు కొట్టింది.
Also Read:Karnataka: ట్విట్టర్ ఖాతాల బ్లాక్ కు కారణమేంటి?.. కేంద్రానికి హైకోర్టు ప్రశ్న
పెర్ల్ ఇటీవల టీవీ ప్రోగ్రామ్ లో షో పాల్గొంది. దాని యజమాని వెనెస్సా ద్వారా షోలో కుక్క పిల్లను పరిచయం చేశారు. అక్కడి వారంతా ఈ చిన్న పప్పీని చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయం గిన్నిస్ బుక్ ప్రతినిధులకు తెలపడంతో వారు ఆమె ఇంటికి వెళ్లారు. పెర్ల్ కొలతలను తీసుకున్నారు. టీ కప్పు కన్నా కాస్త పెద్దగా, థంబ్లర్ కంటే చిన్నగా ఉంది పెర్ల్ . ప్రపంచంలోనే అతి చిన్న కుక్కగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిండంతో దాని యజమాని సంతోషం వ్యక్తం చేశారు.