America: అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో చర్చలు జరిపారు. ఈక్రమంలో వారు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. దీంతో బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది. కానీ ఈ ఒప్పందానికి కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత బైడెన్ దానిపై సంతకం చేస్తేనే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఆ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపక పోతే మళ్లీ బైడెన్ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.
రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా వైట్‌హౌస్, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థి దీనిని ధ్రువీకరించారు. దివాలా అంచుకు చేరిన అమెరికాకు ఈ ఒప్పందంతో కాస్త ఊరట లభించినట్లైంది. శనివారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మెకార్థి మధ్య ఫోన్‌కాల్‌లో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారు ఒప్పందానికి వచ్చారు. తాజాగా ఈ డీల్‌ను కాంగ్రెస్‌లోని తమ పార్టీ సహచరులతో ఆమోదముద్ర వేయించడమే మిగిలి ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా.. సెనెట్‌లో డెమొక్రాట్ల పట్టు ఉంది. ఈ ఒప్పందం జూన్ 5వ తేదీలోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత బైడెన్ దీనిపై సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం అమల్లోకి రాకపోతే.. జూన్ 5వ తేదీ తర్వాత నుంచి అమెరికా అప్పులు చెల్లించే పరిస్థితిలో ఉండదని ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ హెచ్చరికలు జారీ చేశారు. చర్చల అనంతరం తాము సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చినట్లు మెకార్థి మీడియా సమావేశంలో తెలిపారు. దీనిపై అధ్యక్షుడు బైడెన్ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తనతో సహా కాంగ్రెస్‌లోని డెమొక్రాట్ల కీలక ప్రాధాన్యాలు, చట్టపరమైన విజయాలను సంరక్షిస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం రాజీపడటానికి ప్రతీక అని.. అంతేకానీ ప్రతి ఒక్కరికీ వారికి కావాల్సినవి లభిస్తాయని కాదు అని పేర్కొన్నారు.
Read Also: Fungal Meningitis: ఫంగల్ మెనింజైటిస్‌తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..
జూన్ 1 నాటి కల్లా రుణ పరిమితి పెంచకపోతే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఫించన్లతో సహా విదేశాల కొనుగోలు చేసి బాండ్లకు చెల్లింపులు నిలిచిపోతాయి. ఇదే జరిగితే అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్ ఇటీవల కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తే ప్రతిగా డెమోక్రాట్లు తమ విధానాలను మార్చుకోవాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. దీనికి అధికార డెమెక్రాట్ సిద్ధంగా లేదు. వార్షిక బడ్జెట్ నిధుల కేటాయింపులో ఒక శాతం కోత పెట్టి ఆరేళ్ల పాటు డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు భావిస్తుంటే.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం 2023 బడ్జెట్ లాగే 2024 బడ్జెట్ ను కొనసాగిస్తామని అంటున్నారు. 2025 బడ్జెట్ వ్యయాన్ని 1 శాతానికి మించి పెంచబోమని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రక్షణ, రక్షణేతర వ్యాయాలను 2023 స్థాయిలోనే కొనసాగిస్తే 9000 కోట్ల డాలర్లు, పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులుతాయాని డెమెక్రాట్లు వాదిస్తున్నారు. అత్యంత సంపన్నులపైన, కొన్ని బడా కంపెనీలపైన పన్నులు పెంచడం ద్వారా బడ్జెట్ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చని బైడెన్ ప్రతిపాదించగా.. మెకార్థీ దీనికి ఒప్పుకోలేదు.