గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.
ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అశాంతి నెలకొంది. ఏ న్యూస్ చూసినా కరవులు, కాటకాలు, యుద్ధాలు, బాంబు పేలుళ్లు, నరమేధం... ఇలా ఒక్కటేంటి?.. ప్రతీ రోజూ ఏదొక చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది.
ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు.
అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
United Nations: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన విచక్షణారహిత దాడితో ఆరంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆరంభించడం మీకు తెలుసు కానీ ఆపడం మాకు తెలియదు అన్నట్లు ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడులతో విరుచుకుపడుతుంది. ఇరు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలకి అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఈ మారణహోమాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్యసమితి తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మాన సభను UN…
నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్‌లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్‌లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది.
భారతదేశంలో వృద్ధుల జనాభా అపూర్వమైన రేటుతో విస్తరిస్తోంది. శతాబ్దపు మధ్య నాటికి పిల్లల జనాభాను అధిగమిస్తుందని కొత్త యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదిక పేర్కొంది,. రాబోయే దశాబ్దాల్లో యువ భారతదేశం వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుందని ఈ నివేదిక పేర్కొంది.
Turkey On Kashmir: ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాడు.