Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United Nations: ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ మాస్క్ విమర్శలు గుప్పించారు. అయితే, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇటీవల ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేస్తూ.. భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 80 ఏళ్ల కిందటిలా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ స్టార్ట్ అయింది.
Also Read
అలాగే, అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్ ఈ పోస్ట్ కు సమాధానం ఇస్తూ.. మరి భారత్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ మాస్క్ రియాక్ట్ అవుతూ.. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదిలి పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందన్నాడు.. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ చెప్పుకొచ్చాడు.
Read Also: Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం
ఇక, ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ జరగలేదు.. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తున్నప్పటికి.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు.. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాప్పటికి.. ఒక్క చైనా మాత్రం భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అడ్డు తగులుతుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు