ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్పటివరకు పెద్దగా రష్యా దాడులకు…
ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో అక్కడ మెడికల్ విద్యనభ్యసిస్తున్న వేలాదిమంది తిరుగుముఖం పట్టారు. మనదేశంలో వారందరికీ విద్యను పూర్తిచేసే అవకాశం వుంటుందా? విద్యార్థుల భవిష్యత్తేంటి..? అందరికి సీట్లు సర్దుబాటవుతాయా? భవిష్యత్తులో ఉక్రెయిన్ లో చదివే అవకాశం వుంటుందా? అయిందంతా పోసి వారిని అక్కడికి పంపారు. ఏజెన్సీలు ఊదరగొట్టి మరీ చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పంపారు. వందలాదిమంది తెలంగాణ విద్యార్ధులు 700మందికి పైగా ఆపరేషన్ గంగలో ఇక్కడికి తెచ్చారు. కేంద్రంతో మాట్లాడి వారికి అయ్యే ఖర్చు తామే…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన…
ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం సైతం ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిథిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో శ్మశాన వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు నిర్వహిస్తున్న రష్యా..…
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగుతోంది.. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది.. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవరీవ్ను టార్గెట్ చేసింది రష్యా.. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్‌లో దాడులకు పూనుకుంది.. రష్యా దాడుల్లో తాజాగా 35 మంది మృతిచెందగా.. 134 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, మరో మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసింది రష్యా సైన్యం, తాజాగా మెలిటోపోల్ మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.. దీంతో ఇప్పటి వరకు కిడ్నాప్‌నకు గురైన…
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా…
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి రప్పించడానికి భారత ప్రభుత్వం కూడా చేయాల్సిందంతా చేస్తోంది. ఆపరేషన్ గంగ అంటూ స్పెషల్ విమానాలు వంటివి ఏర్పాటు చేసి ఏదో ఒక రకంగా అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓ భారతీయ డాక్టర్ మాత్రం తన పెంపుడు జంతువుల కోసం ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన పెంపుడు జంతువులను ఇక్కడ కూడా…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి…
హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ హీరో సినిమాలోనే కాదు రియల్ గానూ హీరోనే. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయ్యింది. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బంది పడిన ప్రతిసారి నేను ఉన్నాను అంటూ తనవంతు సాయం ప్రకటిస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఈ టైటానిక్ హీరో తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ ల మధ్య…