Russia: ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్ దేశంతో చర్చలు జరిపి అంగీకరింప చేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఖకోవ్కా ఆనకట్ట కూల్చివేత అనంతరం మాస్కోపై క్షిపణుల దాడుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తంగా మారింది. దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. జులై 7-8 తేదీల్లో బెలారస్‌లో అణ్వాయుధాలను మోహరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇదరు దేశాల అధ్యక్షులు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
Read also: Akash-Shloka Ambani: అంబానీ మనుమరాలి పేరేంటో తెలుసా?
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో రష్యా అధ్యక్షులు వ్లాదిమీర్ పుతిన్ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం పుతిన్ ప్రకటన జారీ చేశారు. తాము ఏది చేసిన ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తామన్నారు. చేయాలనుకున్నది స్థిరంగా చేస్తామని సమావేశం అనంతరం పుతిన్ ప్రకటన చేశారు. రష్యా అధీనంలో ఉండే భూ ఉపరితలం నుంచి స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే అణ్వస్త్ర క్షిపణులను బెలారస్‌లో మోహరించాలని గతంలోనే ఇరు దేశాధ్యక్షులు నిర్ణయించారు.
Read also: Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లాలంటే నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్ కీలకం. రెండు దేశాలకు మధ్య ఉన్న కీలకమైన డ్యామ్‌ను పేల్చి వేశారు. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. దాదాపు 60 వేల మంది వరద ముంపులో ఉన్నట్లు తేలింది. డ్యామ్ కూలిపోవడానికి నువ్వంటే నువ్వే కారణమని ఉక్రెయిన్, రష్యాలు ఆరోపించుకుంటున్నాయి. డ్యామ్‌ను పేల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధ వాతావరణం మరింత పెరిగింది. అందుకే అణ్వాయుధాలతో బలంగా ఉన్న రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి దిగనుంది.