Naatu Naatu Song: నాటు నాటు సాంగ్‌పై సైనికుల డ్యాన్స్.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naatu Naatu Song: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. సాధారణ పౌరులే కాకుండా.. కొన్ని దేశాల్లో ఉద్యోగులు కూడా నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చూస్తున్నాం. ఇపుడు ఏకంగా సైనికులే నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి చిందులేసి ఎంజాయ్ చేశారు
నాటు నాటు పాటకు ఉక్రెయిన్ సైనికులు చిందేశారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటపై ఉక్రెయిన్ సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తరహాలోనే.. ఉక్రెయిన్ సైనికులు స్టెప్పులు వేసి ఇరగదీశారు. జేన్ ఫెడటోవా అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివ ఉన్న ఈ వీడియోను మికోలైవ్ నగరంలోని సైనికులు షూట్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎలా రామ్, భీమ్‌లు పాట పాడారో.. అలాగే రష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైనికులు కూడా తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Read Also: Keerthy Suresh: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమెనే…
ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ నిర్మాతలు తమ అఫీషియల్ అకౌంట్‌లోనూ ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు ఆరు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. ఆరు వేల మంది లైక్ కొట్టారు. ఈ యేటి ఆస్కార్స్ వేడుకల్లో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను నిజానికి ఉక్రెయిన్‌లోనే షూట్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికార నివాసం బయటే ఈ పాటను షూట్ చేశారు. అయితే అప్పటికి ఉక్రెయిన్‌పై రష్యా అటాక్ చేయలేదు.
https://twitter.com/Puneetvizh/status/1664849597657694209
- Tags
- Dance
- Naatu Naatu Song
- ntr
- ramcharan
- rrr
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!