Russia-Ukraine War: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ…
Joe Biden: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ అసంపూర్ణంగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇరు దేశాలు సాధించింది ఏమీ లేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మొదలు పెట్టింది.
Biden's top secret visit to Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో చలి కాలం ముగింపుకు రావడంతో రానున్న కాలంలో రష్యా మరింతగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇటు అధికారులకు కానీ అటు మీడియాకు కానీ ముందస్తు…
రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
Roman City : ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1,800 సంవత్సరాల పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్నారు. ఈజిప్టులోని లక్సోర్ నగరం ఈ ఆవిష్కరణకు వేదికైంది. ఈ నగరం రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందినది ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్లోని నీప్రో నగరంలో ఓ అపార్టుమెంట్పై రష్యా శనివారం జరిపిన దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది.
Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తుంది. రెండు వైపులా దాడుల్లో ఎంత నష్టపోతున్నా వెనక్కి తగ్గనంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని సోలెడార్ నగరాన్ని రష్యా ఆక్రమించింది.