తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి…
తిరుమల, తిరుపతి వాసులకు గుడ్న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… స్థానికంగా ఉండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో స్థానికులుకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటా పెరిగింది.. ముందుగా రోజుకి 5 వేల చొప్పున మొత్తం 50 వేల మందికి దర్శన టికెట్లను కేటాయించాలని భావించింది టీటీడీ.. అయితే, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.. రోజుకి 10 వేల…
దశాబ్దాల నాటి భక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. ఏళ్ళ తరబడి శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయం శరవేగంగా పునర్నిర్మాణమవుతోంది.తిరుపతిలోని వకుళామత దేవాలయం పనులని పరిశీలించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్వరలో జరిగే వకుళామత దేవాలయం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని మంత్రి అన్నారు. భారీ వర్షాల కారణంగా పేరూరు చెరువులో నీరు నిండి పనులు ఆగాయన్నారు. ఇప్పుడే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కోనేరు పని పూర్తి చేసి,…
డిసెంబర్ 31వ తేదీన ఫుల్గా ఎంజాయ్ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. టీటీడీ…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ముఖ్యంగా సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది టీటీడీ.. అదే విధంగా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల…
తిరుమల శ్రీవారి టికెట్లు ఏవైనా క్షణాల్లో అమ్ముడవుతుంటాయి. తాజాగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. జనవరి నెలకు ఆన్ లైన్ లో రెండు లక్షల 60 వేల టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. టోకెన్లు విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు భక్తులు. టోకెన్ల బుకింగ్ పూర్తయిన విషయం తెలియక టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అవుతున్నారు వేలాది మంది భక్తులు. వారికి నిరాశే కలుగుతోంది. రేపు శ్రీవాణి…
ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచే భక్తులు వస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శానానికి ఆన్లైన్లో టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అయితే తాజాగా జనవరి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 9 గంటలు విడుల చేసింది. అయితే హాట్ కేకుల్లా సర్వదర్శనం టోకెన్లు బుక్కాయ్యాయి. జనవరి నెలకు సంబంధించి 2.60 లక్షల టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టొకెన్లు అన్ని…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతంలో దర్శనాలు పరిమితం చేశారు. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తిరుమలకు వెళ్ళే దారుల్లో కొండచరియలు విరిగిపడడం, నడక దారి పాడవడంతో భక్తులు తగ్గారు. తిరుమలలో ఆదివారం భక్తులు బాగా పెరిగారు. ఆదివారం కావడం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారింది. శ్రీవారిని 36162 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.…
ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో…