విజయవాడ హిజాబ్ వివాదంపై లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ కిషోర్ మాట్లాడుతూ.. ఇవాళ తరగతిగదిలో ఇద్దరు హిజాబ్ ధరించి వచ్చారు. నేను తరగతి గదులకు రౌండ్ కు వెళ్ళినప్పుడు ఇది గమనించాను. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశించాను. తరగతి గదిలో విద్యార్థులు అందరూ యూనిఫామ్ తోనే ఉంటారు. ఇద్దరు విద్యార్థులను పిలిచి మాట్లాడాను..వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడు ఇక్కడి నిబంధనలు పాటిస్తామని సంతకం చేస్తారు. కలెక్టర్ ఆదేశాలతో తరగతి గదిలో అనుమతినించాం. రేపటి నుండి హిజాబ్ ధరించి రావాలా వద్ద అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
మేడారం సారలమ్మను తీసుకువచ్చే కార్యక్రమంలో గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య, పోలీస్ అధికారుల నృత్యాలు చేశారు. బుధవారం రాత్రి 10.47 నిముషాలకు గద్దెల పై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువు దీరారు. కన్నెపల్లి నుంచి జంపన్న వాగు మీదుగా మేడారంకు సారలమ్మ చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెకు పెనుక వంశస్తులు తీసుకువచ్చారు. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి మేడారం గద్దెకు గోవిందరాజులు విచ్చేశారు. కన్నపల్లి నుంచి సారలమ్మ ను జంపన్న వాగు మీదుగా పటిష్ఠ మైన బందోబస్తు మధ్య గిరిజన, ఆదివాసీ సాంప్రదాయంతో పోలీసులు తీసుకువచ్చారు. వీరి రాకతో జాతర లంఛానంగా ప్రారంభమైంది.. ఈ రోజు రాత్రి గద్దెకు సమ్మక్క తల్లి చేరుకోనుంది. వనదేవతలను కొలిచేందుకు భక్తుల పరవళ్లు.. తల్లుల సన్నిధిలో మారుమొగుతున్న జైగంటలు.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర అసలు గట్టం మొదలు అయ్యింది.. వనదేవతలను కోలిచెందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు.
బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కడైనా, ఎవరైనా సహకరిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ముందు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే ప్రయత్నం చేయాలని, తర్వాత కేంద్రంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఒకప్పుడు కేసీఆర్, టీడీపీ వాళ్లు బీజేపీతో కలసి ప్రయాణం చేసిన వాళ్లేనని, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల తరహాలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఆయన విమర్శించారు. బ్యాంకులను లూటీ చేసిన వాళ్లంతా గుజరాత్ వాళ్లేనని, వీరికి కేంద్రంలోని పెద్దలే సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పాకిస్థాన్, చైనా, రామమందిరం విషయాలను తెరపైకి తెస్తారని, 5రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పే అరాచకాలు సృషిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చెన్నైకి చెందిన భక్తురాలు రేవతి విశ్వనాథం టీటీడీకి భారీ విరాళం అందించారు. డాక్టర్ పర్వతం జ్ఞాపకార్థం 9.2 కోట్ల రూపాయలు విరాళాని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. చిన్నపిల్లల హస్పిటల్ కి 3.2 కోట్లు… శ్రీవారి ఆలయానికి 6 కోట్లు విరాళం అందజేసినట్లు ఆమె వెల్లడించారు.
నేవీ ఇంజినీర్ పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్రీరామ సోమేశ్వర రావుపై సీబీఐ-ఏసీబీ వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2011-19 మధ్య ఆదాయానికి మించిన ఆస్తుల భారీగా కూడబెట్టారని సీబీఐ నిర్ధారణ వచ్చింది. ఆయన భార్య పద్మావతి పేరును ఎఫ్ఐఆర్ లో సీబీఐ చేర్చింది. పలు కొనుగోళ్లలో రూ.89 లక్షల వరకు అవకతవకలకు పడ్డారని సమాచారం.
కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య విమాన రాకపోకలు, సీటింగ్ పరిమితిని కేంద్రం తొలగించింది. డిమాండ్ కు తగ్గట్టుగా విమానాలు, చార్టర్ విమానాలు నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుంచి భారత్ కు వస్తున్న వాళ్ళ సంఖ్య పెరగటంతో కేంద్ర ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణ ఆంక్షలను పౌర విమానయాన శాఖ సులభతరం చేసింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణంతో భారత్ కు ప్రయాణాలు పెరుగుతున్నాయి.