సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపత దేవస్థానం (టీటీడీ).. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది… సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది… వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి… ఇక, శుక్ర, శని, ఆదివారలలో సర్వదర్శనం భక్తులు సౌకర్యార్థం అదనంగా దర్శన టోకేన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకేన్లు టీటీడీ జారీ చేస్తోన్న విషయం తెలిసింది.. టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
Read Also: AP: వైద్యారోగ్యశాఖలో బదిలీల గడువు పొడిగింపు