కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆరు రోజుల క్రితం ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాము కాటు.. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి…
తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా…
కోవిడ్ కారణంగా తిరుమలకు వెళ్ళే భక్తులు తగ్గారు. ఇప్పుడిప్పుడే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ ప్రకియ ప్రారంభిస్తాం అని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా ప్రస్తుతం సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తున్నాం అన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాన్ని గత…
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి మాసానాకి సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఎల్లుండి ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటా టికెట్లను ఉంచనున్నారు.. ఎల్లుండి ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్‌చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి మాసంలో రోజుకి 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ.. రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం…
తిరుమలలో కురిసిన భారీవర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు గురి అయ్యారు.. సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిపోయారు. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో స్వల్పంగా వర్షపు నీరు చేరుకుంది. వాన నీటిని బయటకు తోడే పనిలో…
తిరులమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో ఇక నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండవని పేర్కొంది. పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులును దర్శనానికి అనుమతించిన టీటీడీ. పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3 లక్షల 77వేల 943 మంది భక్తులు. 1,22,799 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పది…
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా? ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ…