పెళ్లి చేసుకోవాలనుకునే పేదలకు టీటీడీ అధికారులు గుడ్న్యూస్ అందించారు. ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు,…
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106…
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. తిరుమలలో భక్తుల రద్దీ అన్యూహంగా పెరిగినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్కి ప్రత్యేకంగా అధికారులును కేటాయించామని తెలిపారు.. ప్రస్తుతం క్యూ లైన్లో చేరుకుంటున్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల పాటు వేచివుండవలసిన పరిస్థితి ఉందన్నారు… క్యూ లైన్లో ఉన్న భక్తులుకు నిరంతరాయంగా ఆహార సౌకర్యాని కల్పిస్తున్నామని.. రేపు రాత్రికి…
ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. కోవిడ్ కారణం గత రెండు సంవత్సరాలు పూర్తిస్థాయిలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించలేదు. అయితే ఇటీవల పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతించడంతో తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. అయితే స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటరన్న వ్యవధిలోనే దర్శన…
తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీటీడీకి అత్యధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు రూ.10 కోట్ల విరాళాలు అందించారు. ఈ నలుగురు భక్తుల్లో గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళం అందజేశాడు. Rains In AP : ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు.. తిరునల్వేలికి చెందిన…
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్య గమనికను విడుదల చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. Jagan Davos Tour: స్టైలిష్…
తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. నాణ్యత లేని జీడి పప్పు సరఫరా చేసిన టెండర్ ని రద్దు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఏలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కి పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యత పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన…