Tirumala: తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం పలు కార్యాలయాలతో పాటు వసతి గృహాలు, గెస్ట్ హౌస్లు, క్యూ క్లాంప్లెక్స్లు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే తిరుమల వెళ్లే భక్తులు వీటికి వెళ్లే మార్గాలు తెలియక తికమక పడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం టీటీడీ తిరుమల మార్గదర్శిని పేరుతో ఓ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకురానుంది. కొండపై ఒకచోటు నుంచి మరోచోటుకు సులభంగా వెళ్లేలా ఈ క్యూఆర్ కోడ్ సహాయం…
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.…
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి…
తిరుమలలో నేడు వరాహజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచనున్నారు. నేడు వరాహ జయంతి సందర్భంగా.. ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు.. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది.…
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). అక్టోబరు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు (ఈ నెల 18వ తేదీన) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, భక్తులకు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకుంటే మంచిది.. ఎందుకంటే.. అక్టోబర్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాల…
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజుల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. Read Also:…