Tirumala Temple: రెండు రోజుల పాటు మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. దీంతో ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపింది. అదే మాదిరిగా నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2:39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Read Also: పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా?.. అస్సలు మంచిది కాదండోయ్..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
కాగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కారణంగా ఆ రెండు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం), కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వివరించింది. ఆయా రోజుల్లో గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది. కాగా ఈనెల 27 నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..