తిరుమల కొండపై టీటీడీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. నగదు చెల్లింపుల స్థానంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే టీటీడీ దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్న వేళ తిరుమలలోనూ యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద భక్తుల వసతి గదుల కేటాయింపును టీటీడీ ఎంచుకుంది. Read Also: Polavaram Flood Effect: పోలవరంపై గోదారి వరద ప్రభావమెంత? వసతి గదుల కేటాయింపు సమయంలో భక్తులు…
పెళ్లి చేసుకోవాలనుకునే పేదలకు టీటీడీ అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు,…
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106…
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. తిరుమలలో భక్తుల రద్దీ అన్యూహంగా పెరిగినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా అధికారులును కేటాయించామని తెలిపారు.. ప్రస్తుతం క్యూ లైన్లో చేరుకుంటున్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల పాటు వేచివుండవలసిన పరిస్థితి ఉందన్నారు… క్యూ లైన్లో ఉన్న భక్తులుకు నిరంతరాయంగా ఆహార సౌకర్యాని కల్పిస్తున్నామని.. రేపు రాత్రికి…