ప్రతి సంవత్సరం నిర్వహించే తిరుమల బ్రహ్మోత్సవాలు కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నిర్వహించలేదు. అయితే.. ఈ ఏడాది అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయింది. అయితే..ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ బ్రహోత్సవాలకు భక్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం అప్రమత్తమైంది. అయితే.. ఈ ఉత్సవాలకు సుమారు 5వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమలకు వెళ్లే వాహనాలు 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించ కూడదని నిర్ణయించింది టీటీడీ.
వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో వదిలేసి అక్కడి నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించింది తిరుమల దేవస్థానం. గరుడ సేవ నిర్వహించే రోజున ఉదయం నుంచి మరుసటి రోజు వరకు మామూలుగానే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అక్టోబరు 1న గరుడ సేవ నిర్వహించనుండడంతో ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.