తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి భాస్కర్… సేలం కన్స్యూమర్ కోర్టులో టీటీడీ తీరుపై ఫిర్యాదు చేశారు.. మరోవైపు.. కరోనా సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టీటీడీ పేర్కొంది.. కానీ. అందుకు నిరాకరించని భక్తుడు.. మేల్ చాట్ వస్త్రం సేవ కావాలని పట్టుబట్టాడు.. అయితే, భక్తుడి విజ్ఞప్తిని టీటీడీ పట్టించుకోకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాడు.. హరి భాస్కర్ పిల్ పై విచారణ జరిపిన కన్స్యూమర్ కోర్టు.. సంవత్సరం లోపు మేల్ చాట్ సేవ దర్శన టికెట్ కేటాయింపు చేయాలని లేదంటే రూ.50 లక్షలు బాధితుడికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Minister Jogi Ramesh: కుప్పంలోనే దిక్కు లేదు.. పులివెందులను టచ్ చేసే ధైర్యం ఉందా?