శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోవ రోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ ఈ రోజే జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇవాళ తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లలిత్.. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నారు.. ఈ వాహన సేవకు వచ్చే భక్తులందరికి దర్శనభాగ్యం కల్పించేందుకు పటిష్టచర్యలు…
Tirumala: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల టూర్‌పై రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. తిరుమల పర్యటనలో సీఎం జగన్ వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించామని.. ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులంతా తీవ్ర నిరాశ చెందారని రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు అర్చక వ్యవస్థను, ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని…
Brahmotsavalu in Tirumala: ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.