టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. తిరుమలలో ఇవాళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించినట్టు.. ఆ సమావేశం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. ఇక, పిభ్రవరి 23వ తేదీన బాలాలయ పనులు ప్రారంభిస్తాం.. 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు.. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో మార్పులు ఉండవని.. భక్తులు సమర్పించిన బంగారంతోనే తాపడం పనులు నిర్వహిస్తామన్నారు.. ఇక, జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని.. గత ఏడాది తరహాలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు..
Read Also: CM YS Jagan Great Heart: బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే సాయం..
మరోవైపు.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభిస్తామని తెలిపారు వైవీ సుబ్బారెడడ్ఇ.. నందకం అతిధి గృహంలో 2.95 కోట్లతో ఆధునాతనమైన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఘాట్ రోడ్డులో 9 కోట్ల రూపాయల వ్యయంతో క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తామని.. బాలాజీకాలనిలో 3 కోట్ల రూపాయల వ్యయంతో స్థానికుల నివాసాలకు మరమత్తులు నిర్వహిస్తామని.. 3.8 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి అతిథి గృహంలో గదులు మరమత్తులు చేపడతామన్నారు.. ఇక, జమ్ములో ఆలయల నిర్మాణానికి 7 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి.. 3.3 కోట్ల రూపాయల వ్యయంతో స్వీమ్స్ హస్పిటల్‌లో హాస్టల్ గదులు నిర్మించనున్నట్టు.. తిరుపతిలోని తాతాయ్యగుంట అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం 3.7 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.. ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించామని.. కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జీతాలు పెంపుపై అధ్యయనం కోసం ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.