Vaikunta Dwara Darshanam: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులు పాటు భక్తులకీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు ముందుగానే జారీ చేస్తామని.. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో ప్రతి నిత్యం 50 వేల టికెట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ప్రతి నిత్యం 25 వేలు ఆన్‌లైన్ కేటాయిస్తామన్నారు. అయితే, వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజులు పాటు టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు అనుమతిస్తాం.. కానీ, వారిని దర్శనానికి మాత్రం అనుమతించే అవకాశం ఉండదన్నారు.. ఇక, లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అవకతవకలు పాల్పడుతున్నారని.. ఇప్పటికే ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు చేశామన్నారు.. నెల రోజులుగా లడ్డూ కౌంటర్లో నిఘా వ్యవస్థను పటిష్టపర్చడంతో.. కాంట్రాక్ట్ ఉద్యోగులు కుట్రకు పాల్పడుతున్నారన్న ముందస్తు సమాచారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు ఈవో ధర్మారెడ్డి.
Read Also: Students Clash: విశాఖలో నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థుల రచ్చ.. గ్రూపులుగా విడిపోయి తన్నుకున్నారు..
Also Read
ఇక, ఇవాళ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల ప్రారంభించి.. ఆరు నెలలు లోపు తాపడం పనులను పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బారెడ్డి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ లో సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం నిర్వహించి బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. భక్తులు సమర్పించిన బంగారంతోనే తాపడం పనులు నిర్వహిస్తామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని.. గతేడాది తరహలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల మధ్య ప్రారంభిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!