Tirumala Laddu: శ్రీవారి లడ్డూపై అపోహలు వద్దు.. టీటీడీ వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎంత బిజీగా వున్నా.. తిరుమల వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత వుంటుందని, కోరిన కోరికలు ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని అంటారు. శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలు వద్దంటోంది టీటీడీ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బరువును పోటు అధికారులు తనిఖీ చేస్తారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించి, భక్తులకు అందిస్తారు. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుందని టీటీడీ తెలిపింది.
Read Also: Kodali Nani Challenge: చంద్రబాబుకి నాని సవాల్.. ఇవే చివరి ఎన్నికలు!
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
వేయింగ్ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కారణంగా లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ పడలేదు.
సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదేని ఇబ్బంది తలెత్తితే వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలియజేస్తే, అక్కడిక్కడే సమస్యను పరిష్కరించే వ్యవస్థ టీటీడీలో ఉంది. కానీ సదరు భక్తుడు ఇవి ఏమి చేయకుండా సోషల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయంఅని టీటీడీ పేర్కొంది. భక్తుడు ఆరోపించినట్లు లడ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్యత్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ ఒక ప్రకటనలో కోరుతోంది.
Read Also: T20 World Cup: ఇండియా ఓటమిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఏమన్నారంటే..
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..