తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా మరో 995 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. దీంతో ఇప్పటివరకూ వివిధ శాఖల్లో ఉన్న 45,325 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది.
గ్రూప్ వన్ కి సంబంధించిన అనూహ్యమయిన స్పందన లభించింది.ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకుంది.అక్టోబర్‌లో ప్రిలిమినరీ నిర్వహించనుంది.
Agnipath Protest : అసలు ఎలా జరిగింది.. పూర్తి వివరాలు..