శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా..
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.