ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికాలో పర్యటించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు రహస్య సమావేశాలు నిర్వహించారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా అధికారులతో రహస్య చర్చలు చేశారు. అయితే అమెరికా టూర్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Perni Nani: “నేనెవరిని నరకమని చెప్పలేదు”.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
నెతన్యాహు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండాలంటే గాజాలో మరిన్ని రోజులు యుద్ధం చేస్తేనే నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే హమాస్‌పై యుద్ధం కొనసాగించడమే మార్గమని భావిస్తున్నారు. దీనిపై అమెరికా పెద్దలతో కీలక మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Apollo : స్వస్థ్ మేళా 2025లో అపోలో డయాలసిస్ క్లినిక్స్ చొరవ
అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లో హమాస్‌తో కాల్పుల విరమణ-బందీ ఒప్పందాన్ని పూర్తి చేయగలనని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక పర్యటనలో అమెరికా మీడియాకు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ మీడియాకు మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే యుద్ధం ముగిస్తే సౌదీ అరేబియాతో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా వెళ్లే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యుద్ధాన్ని ముగించడం నెతన్యాహుకు వ్యక్తిగత ప్రమాదంతో కూడుకున్నదని సమాచారం. 75 ఏళ్ల నెతన్యాహు 2020 నుంచి అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అధికారాన్ని కోల్పోతే నెతన్యాహు విచారణకు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే నెతన్యాహు.. గాజాపై యుద్ధాన్ని చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గాజాలో యూదు స్థావరాలను తిరిగి స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్.. ఇప్పటికే గాజాలోని పాలస్తీనా వాసులను ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయితే నెతన్యాహు కొత్త ప్లాన్ ఈ వారంలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.